![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో "లోకల్ చిచ్చాస్ వెర్సెస్ పాన్ ఇండియా మచ్చాస్" మధ్య పోటీ జరిగింది. ఇక హోస్ట్ శ్రీముఖి రెడ్ కలర్ డ్రెస్ లో హాట్ మిర్చిలా ఉంది. అలాగే స్టార్ మా పరివారం వాళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది. శ్రీముఖి ఫోటో ఒకటి తెచ్చి అందులో కళ్ళను తీసేసి ఆ ఫోటో మీద మంచి షేప్ తో ఎవరైతే కళ్ళను డ్రా చేస్తారో వాళ్ళు విన్ ఐనట్టు అంటూ పోటీ పెట్టింది.
ఆ తర్వాత నాగపంచమి సీరియల్ హీరో మోక్ష అలియాస్ ప్రిథ్వి ప్రిన్స్ శెట్టి బ్లాక్ మార్కర్ తో ఆ పిక్చర్ కళ్ళను డ్రా చేస్తాడు. "అదేంటి నా ఫేస్ లో కళ్ళ కింద క్యారీ బాగ్స్ వేశాడేంటి" అని కామెడీ చేసింది శ్రీముఖి. "కాదు లవ్ లో బ్రేకప్ ఐనప్పుడు" అని మోక్ష చెప్తుండగా "ఓహో బ్రేకప్ ఐనప్పుడు ఏడిస్తే నేను ఇలా ఉంటానా" అని శ్రీముఖి అనేసరికి అందరూ పడీపడీ నవ్వేశారు. ఇక శ్రీముఖి ఫేస్ కి కళ్ళను డ్రా చేస్తాం అంటూ అందమైన అమ్మాయిలూ పోటీలు పడి కొట్టుకునేసరికి మధ్యలో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల వచ్చి "శ్రీముఖి కోసం ఇద్దరబ్బాయిలు కొట్టుకోవచ్చు కానీ ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం ఏమిటి" అంటూ కౌంటర్ వేసాడు. ఇక శ్రీముఖి అవినాష్ మీద ఎక్స్ప్రెస్ హరి మీద ఫుల్ పంచులు వేసింది..అవినాష్ రెచ్చిపోయి పాన్ ఇండియా మచ్చాస్ యూత్ అసోసియేషన్ అనేసరికి "అది యూత్ లో ఉన్నప్పుడు పెట్టొచ్చు కదా భూతైపోయాక పెట్టాడు" అనేసరికి అవినాష్ షాకయ్యాడు. ఇలా ఈ షో ఈవారం ఎంటర్టైన్ చేయడానికి ఆదివారం ఉదయం రాబోతోంది.
![]() |
![]() |